ఆగష్టులో విడుదలకానున్న అనుష్క నటిస్తున్న వర్ణ చిత్రం ??

Vana
తాజా తమిళ చిత్రవర్గ కధనాల ప్రకారం అనుష్క, ఆర్య కలిసి నటిస్తున్న ‘వర్ణ’ సినిమా ఆగష్టు మొదట్లో విడుదలకానుంది. సెల్వరాఘవన్ దర్శకుడు. ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను పి.వి.పి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తయ్యి చాలాకాలంకావస్తున్నా దర్శకుడు నిర్మాణాంతర పనులలో నిమఘ్నమై ఉన్నాడు. ఈ సినిమాలో చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నందున చివరి వెర్షన్ కు ముందే రీ రికార్డింగ్ సక్రమంగా ఉండేలా చూసుకుంటున్నాడు.

ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతదర్శకుడు. ఈ సినిమా ఆగష్టు 9న విడుదలకావచ్చు. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. జూలై మూడవ వారంలో ఆడియో విడుదలకానుంది. ఈ సినిమా మొదటి లుక్ కి మంచి స్పందన వచ్చింది. వార్తల ప్రకారం అనుష్క ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలలో కనిపించనుంది

Exit mobile version