అత్యధిక రేమ్యురేషణ్ తీసుకుంటున్న అనుష్క, నయనతార


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రేమ్యురేషణ్ విషయానికి వస్తే ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే పద్ధతిని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ రోజు ఒక ప్రముఖ దిన పత్రికలో నయనతార మరియు అనుష్క ఈ ఇద్దరు భామలు దాదాపు 1 కోటి 15 లక్షల రూపాయల వరకు రేమ్యురేషణ్ తీసుకుంటున్నట్లు ప్రచురించింది. కాజల్, ఇలియానా, తమన్నా దాదాపుగా 1 కోటి రూపాయల వరకు తీసుకుంటున్నట్లు, ఆ తరువాతి వరసలో సమంతా, త్రిషా 80 లక్షల వరకు పెంచినట్లు సమాచారం. చిత్ర విజయంలో హీరోయిన్ల పాత్ర కూడా ఉంటుండటంతో వారు కూడా హీరోలతో పాటుగా తమ రేమ్యురేషణ్ కూడా పెంచుతున్నారు.

Exit mobile version