నాగ చైతన్య పుట్టిన రోజున ‘ఆటోనగర్ సూర్య’ ట్రైలర్

auto-nagar-surya

నాగ చైతన్య హీరోగా నటించిన ‘తడాక’ సినిమా మంచి విజయాన్ని సాదించిన విషయం తెలిసిందే. దానితో నాగ చైతన్య ప్రస్తుతం ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ సినిమా షూటింగ్ లో నటిస్తూ బిజీగా వున్నాడు. తను నటిస్తున్న ‘ఆటో నగర్ సూర్య’ సినిమా గత కొన్ని రోజుల ముందు వరకు చాలా ఫైనాన్షియాల్ సమస్యలను ఎదుర్కొంది. ఈ మద్య ఈ సినిమా షూటింగ్ ని ఈ సినిమా నిర్వాహకులు తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ ని నవంబర్ 23న నాగ చైతన్య పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా ఆడియో ని త్వరలో విడుదల చేసే అవకాశం వుంది.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవా కట్ట దర్శకత్వం వహిస్తున్నాడు. అనుప్ రుబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని కే. అచ్చి రెడ్డి నిర్మిస్తున్నాడు.

Exit mobile version