‘దేవర-2’లో మరో స్టార్ హీరోయిన్ ?

‘దేవర-2’లో మరో స్టార్ హీరోయిన్ ?

Published on Nov 2, 2025 2:03 PM IST

devara

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓటీటీలో కూడా అద్భుతంగా అదరగొట్టింది. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ‘దేవర పార్ట్-2’ డిసెంబర్ లో షూట్ స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ నటించబోతుందని టాక్ నడుస్తోంది. ఆ హీరోయిన్ ప్రియాంక చోప్రా అని రూమర్. మరి ఈ రూమర్ లో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

కొరటాల శివ మాత్రం ‘దేవర పార్ట్-2’ కథలో చాలా మార్పులు చేశారట. ఇందులో భాగంగానే ప్రియాంక చోప్రా పాత్రను క్రియేట్ చేశారని టాక్. కాగా ఈ మూవీ పార్ట్ 1 లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించారు. మొత్తానికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సీక్వెల్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు