మన దక్షిణాది నుంచి ఇండియన్ బాక్సాఫీస్ మీదకు దండెత్తడానికి రెడీ గా ఉన్న భారీ చిత్రాల్లో ఒకటి “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం యావత్తు భారతదేశపు ఫిల్మీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుకున్నా ఈ చిత్రం అన్ని పరిస్థితులు బాగున్నట్టయితే ఇదే అక్టోబర్ లో విడుదలకు రెడీ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ మూలాన పెద్ద దెబ్బ పడింది. అయితే గత కొన్ని రోజుల కితం మాత్రం ఈ అక్టోబర్ లో సినిమా విడుదల సమయానికి మాత్రం మేకర్స్ టీజర్ ను ప్లాన్ చేస్తున్నారని టాక్ బయటకొచ్చింది.
ఇపుడు అదే టాక్ మరింత బలపడినట్టు తెలుస్తుంది. ఈ అక్టోబర్ 25న దసరా మహోత్సవం సందర్భంగా మేకర్స్ ప్లాన్ చేయనున్న టీజర్ తూ రాకీ భాయ్ అడుగు పడనుంది అని టాక్ ఊపందుకుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ ఈ టీజర్ కోసం మాత్రం చాలా మందే ఎదురు చూస్తున్నారు. మరి ఆ టైం కి టీజర్ వస్తుందో లేదో చూడాలి.