విజయ్ “మాస్టర్” కు మరో 500 స్క్రీన్స్ యాడ్ అయ్యాయట.!

ఇళయ థలపతి విజయ్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “మాస్టర్”. ఈ సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు ఈ చిత్రం రెడీ అవుతుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్ రోల్ లో నటించిన ఈ చిత్రానికి గాను మన ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ కనిపిస్తుంది.

మరి అంతలా అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రానికి గాను ఇప్పుడు మరో 500 స్క్రీన్ లు యాడ్ అయ్యినట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేసిన ఈ చిత్రానికి మన ఇండియాలో అన్ని భాషల్లో కలిపి మరో 500 స్క్రీన్లు యాడ్ అయ్యాయట. దీనితో టైం దగ్గర పడే కొద్దీ ఈ చిత్రానికి అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించగా గ్జావియర్ బ్రిట్టో మరియు 7 సవ్రీన్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version