టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో కలిసి ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టు కెళుతున్న వెంకటేష్, వరుణ్ లుక్ ఆసక్తి రేపగా… ఇది డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని తెలియజేశారు. అయితే ఈ సీక్వెల్ లో కూడా తమన్నా, మెహరీన్‌లే కథానాయికలుగా నటించబోతున్నారు. వీళ్ళు వెంకీ వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. మొత్తానికి భార్యల టార్చరే ఎఫ్ 3 కథకు మెయిన్ మోటివ్ అని సమాచారం.
ఇక ఈ జనరేషన్ లో కామెడీని హ్యాండిల్ చేయడంలో బెస్ట్ ఎవరు అనగానే ముందుగా అనిల్ రావిపూడి పేరే ముందువరుసలో ఉంటుంది. అంతగా అనిల్ టాలీవుడ్ లో తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సినిమాకి ఫుల్ డేట్స్ కేటాయించారు. ఇప్పటికే నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబులు నాలుగు నెలల్లో సినిమాని పూర్తి చేసి.. సమ్మర్ కు ఎఫ్ 3 రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారట. అన్నట్లు వెంకీ వరుణ్ ఇద్దరు హీరోలు ఎఫ్ 3 సినిమా పూర్తయ్యేవరకూ తమ డేట్స్ ను కేవలం ఎఫ్ 3 కే కేటాయించారట.