సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ `సరిలేరు నీకెవ్వరు`. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో కలెక్షన్ల ప్రభంజనం సృష్లించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్(నాన్ బాహుబలి 2) గా నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన సినీ కెరీర్ గురించి, తానూ సినిమాల్లోకి రావడానికి ప్రేరణ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘నేను డైరెక్టర్ అవ్వడానికి వినాయక్ గారే కారణం. గుంటూరు హరి హర మహల్ లో ‘ఆది’ సినిమాకి వెళ్తే పిల్లోడు రెండు బాంబులు వేయగానే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వి.వి.వినాయక్ అని స్క్రీన్ మీద పడుతుంది. ఆ టైమ్ లో థియేటర్ అంతా విజిల్స్, క్లాప్స్ తో నిండిపోయింది. అప్పుడు ఒక డైరెక్టర్ కి ఇంత వేవ్ ఉంటుందా ? అని ఆశ్ఛర్యం వేసి గూస్బమ్స్ వచ్చాయి. ఆరోజే సినిమా ఇండస్ట్రీ కి వెళ్తే డైరెక్టర్ గానే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమాలు తీసిన దర్శకుల మధ్య నేను నిలబడినందుకు గర్వంగా ఉంది. ఈ సంవత్సరం తెలుగు సినిమాకి మర్చిపోలేని సంక్రాంతి. మైండ్ బ్లాక్ రెవెన్యూస్ వచ్చాయి. ప్రతి సంవత్సరం ఈ రెవెన్యూ ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను. ఎఫ్ 2 జరుగుతున్న సమయంలోనే కథ విని నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఇక రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా ప్రొఫెసర్ భారతీగా లేడీ అమితాబ్ విజయశాంతి నటించారు.