ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ 28, 2025న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక నుంచి మేకర్స్ ప్రమోషన్లతో ముందుకు సాగనున్నారు.
కాగా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, వీటీవీ గణేష్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు వివేక్-మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.


