బిగ్ బాస్ మరో వారాంతానికి చేరుకుంది. దీనితో హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ వేదికపైకి వచ్చేశారు. నిన్న శనివారం ఎపిసోడ్ లో వారం రోజులుగా ఇంటి సభ్యుల ప్రవర్తన, తప్పొప్పులను ఆయన ప్రశ్నించడం జరిగింది. మోనాల్-అఖిల్ మధ్య రిలేషన్, గొడవల గురించి నాగార్జున ప్రత్యేకంగా అడిగారు. అఖిల్ ని మోనాల్ నీకు ఫ్రెండా లేక అంతకు మించా..? అని అడుగగా జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పాడు. ఇక మోనాల్ సైతం అఖిల్ నాకు ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి ఏమిలేదని చెప్పడం జరిగింది. టాస్క్ నుండి సెల్ఫ్ రెస్పెక్ట్ పేరుతో బయటికి వెళ్ళిపోయిన అభిజిత్ పై నాగార్జున అసహనం వ్యక్తం చేశాడు. మిగతా వాళ్లకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని సూటిగా ప్రశ్నించారు.
కాగా ఈ వారం ఎలిమినేషన్స్ కి గాను మొత్తం ఐదురుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. నిన్న ఎపిసోడ్ లో హారిక సేవ్ అయినట్లు ప్రకటించడం జరిగింది. ఇక మోనాల్, అవినాష్, అభిజిత్ మరియు అమ్మ రాజశేఖర్ లలో నేడు ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఈ నలుగురిలో అభిజిత్, అవినాష్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. ఈ వారం కూడా మోనాల్ సేవ్ అని తెలుస్తుండగా అమ్మ రాజశేఖర్ ఇంటిని వీడనున్నాడట. ఈ వారం హౌస్ నుండి బయటికి వచ్చేది కన్ఫర్మ్ గా అమ్మ రాజశేఖర్ అన్న మాట వినిపిస్తుంది.