రాక్షసుడుతో హిట్ అందుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘అల్లుడు అదుర్స్’ సినిమా రాబోతుంది. అయితే.. ఈ అల్లుడు అధుర్స్ సినిమాను జనవరి 14న ఒక రోజు ముందుగా విడుదల చేయబోతున్నారు. అంతకుముందు ఈ చిత్రాన్ని జనవరి 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కాకపోతే ఒక రోజు ముందుగా రిలీజ్ చేస్తే బెటర్ అని టీమ్ ఫిక్స్ అయింది. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ కోసం డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ తో కూడుకున్న యాక్షన్ డ్రామాను సిద్ధం చేశాడట.
ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. అందుకోసం బెల్లంకొండ శ్రీనివాస్ ప్రత్యేకంగా కొత్తగా మేకోవర్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఈ సినిమా ఉంటుందట. ఆ చిత్రంలో ఉన్నట్టే హీరో పాత్ర ఫుల్ ఎనర్జీతో నడుస్తుందని.. మొత్తానికి సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మొత్తానికి ఈసారి కమర్షియల్ హిట్ అందుకోవాలని బెల్లంకొండ హీరో గట్టిగా ప్రయత్నిస్తున్నట్టున్నారు.