హిందీలో రీమేక్ కానున్న అల్లు అర్జున్ మూవీ

హిందీలో రీమేక్ కానున్న అల్లు అర్జున్ మూవీ

Published on Dec 16, 2013 3:45 PM IST

allu-arjun
2004లో వచ్చిన ఆర్య సినిమా ద్వారా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చుకున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ నా ప్రేమని ఫీలయితే చాలు నన్ను ప్రేమించనక్కర్లేదని చెప్పే ఓ కుర్రాడి పాత్రలో కనిపించాడు. అప్పట్లో యూత్ ని బాగా ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగులో రొమాంటిక్ ఫిల్మ్స్ ని కాస్త మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఆ సినిమా రిలీజ్ అయిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ సినిమాని హిందీలో రీమేక్ చేయనున్నారు.

బాలీవుడ్ తాజా వార్తల ప్రకారం కుమార్ తరౌని ఆర్య సినిమా రైట్స్ ని కొనుక్కున్నారు. ఇటీవలే కుమార్ తరౌని తన కుమారుడు గిరీష్ తరౌనిని ఇటీవలే రామయ్యా వస్తావయ్యా సినిమాతో హీరోగా పరిచయం చేసాడు. ఈ సినిమా కూడా తెలుగులో వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకి రీమేక్. హిందీ రీమేక్ ఆర్య సినిమాని కూడా సుకుమార్ డైరెక్ట్ చెయ్యాలని కుమార్ తరౌని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ విషయం ఇంకా ఖరారు కాలేదు

ఆర్య సినిమా కాకుండా శౌర్యం, డాన్ శీను సినిమాల రీమేక్ రైట్స్ ని కూడా కుమార్ తరౌని సొంతం చేసుకున్నాడు.

తాజా వార్తలు