అల్లు అర్జున్ ఫోటో షూట్ కోసం 60 కాస్ట్యూమ్స్!


అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఆర్య 2, వరుడు, వేదం. బద్రీనాథ్ ఇలా తన సినిమాలన్నీ వరుస పరాజయం పాలవడంతో ఇప్పుడు చేసే సినిమాలకి సంభందించిన ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాడు. జులాయి సినిమాకి బాగా కేర్ తీసుకుని భారీ హిట్ కొట్టాడు. నెక్స్ట్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో చేయబోతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ విషయంలో కూడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల అల్లు అర్జున్ మీద ఒక ఫోటో షూట్ చేసారు. ఈ ఫోటో షూట్ కోసం అల్లు అర్జున్ 60కి పైగా కాస్ట్యూమ్స్ వాడాడు. అలాగే ఈ సినిమా కోసం పూరి జగన్నాధ్ ఆస్థాన టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా మార్చినట్లు సమాచారం. అమల పాల్, కేథరిన్ తెరిసా కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో స్టార్ట్ అవుతుంది.

Exit mobile version