‘ఆహా’ కోసం బన్నీ – త్రివిక్రమ్ కలయికలో.. !

‘ఆహా’ కోసం బన్నీ – త్రివిక్రమ్ కలయికలో.. !

Published on Nov 7, 2020 5:59 PM IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి ఇప్పటికే చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తూనే.. మరోపక్క ప్రత్యేక షోలను కూడా డైజిన్ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆహాకి త్రివిక్రమ్ మరియు బన్నీ కలిసి ప్రమోషన్ యాడ్ ఒకటి చెసారు. ఈ దీపావళికి ఇది విడుదల కానుంది. అలాగే ఈ దీపావళి కోసం ఆహా కోసం 5 స్పెషల్ షోలను రెడీ చేస్తున్నారు.

ఏమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సాగుతున్న అల్లు అరవింద్, ప్రస్తుతం తన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ తో తెలుగులో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. అమెజాన్, జీ5, హాట్ స్టార్ మాదిరిగానే ఆహాను ఆ స్థాయిలో నిలబెట్టడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు పోతున్నాడు. నిజానికి కొత్త సినిమాల వరకు సబ్ స్క్రిప్షన్ చేసుకుంటేనే వీక్షించే వీలున్నప్పటికీ.. పాత హిట్ సినిమాల్ని మాత్రం ఫ్రీగానే చూసే వీలు కల్పిస్తూ మిగతా ప్లాట్ ఫామ్స్ కంటే భిన్నంగా ఉండేలా చూస్తున్నాడు ఆహాని. పైగా సబ్ స్క్రిప్షన్ చార్జీలను కూడా ఇతర ఒటీటీలతో పోల్చితే తక్కువగానే ఉంచి వీక్షకుల్ని బాగా ఆకర్షించారు.

తాజా వార్తలు