‘ఈ రోజుల్లో’, ‘బస్ స్టాప్’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ‘కొత్త జంట’ సినిమా చేస్తున్నాడు. అల్లు శిరీష్, రేజీనా జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చిలో ప్రక్షకుల ముందుకు రానుంది.
అలాగే మారుతి వెంకటేష్ హీరోగా ‘రాధ’ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా లాంచనంగా ఈ రోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అరవింద్ మారుతి గురించి మాట్లాడుతూ ‘మారుతికి మంచి భవిష్యత్ ఉంది. తన సబ్జెక్ట్స్ పట్ల పూతి క్లారిటీ, విజన్ ఉన్న వ్యక్తి. ప్రస్తుతమున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ లో బ్రిలియంట్ డైరెక్టర్ మారుతి’ అని కితాబులిచ్చారు. వెంకటేష్ హోం మినిస్టర్ గా కనిపించనున్న’రాధా’లో నయనతార హీరోయిన్ గా నటించనుంది.