మెగా ప్రొడ్యూసర్ యాప్ కోసం తమన్నా టాక్ షో.

మెగా ప్రొడ్యూసర్ యాప్ కోసం తమన్నా టాక్ షో.

Published on Jun 24, 2020 5:25 PM IST

భవిష్యత్ మొత్తం డిజిటల్ మీడియాదే అని అందరూ నమ్ముతున్నారు. ఓ వైపు థియేటర్స్ కి ఆదరణ తగ్గిపోతుండగా ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ పై తమ ద్రుష్టి మళ్లిస్తున్నారు. దీనిలో భాగంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొన్ని రోజుల క్రితం ఆహా అనే ఓ డిజిటల్ యాప్ తీసుకొచ్చారు. దీని అభివృధ్ధికోసం ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు . ఆహా యాప్ తెలుగు వారికి మరింత చేరువ చేయడానికి అల్లు అరవింద్ ఇప్పటికే పలువురు దర్శకులు, కంటెంట్ రైటర్లను రంగంలోకి దించారు.

అంతేకాకుండా హీరోయిన్లకు సైతం వెబ్ సిరీస్ లో నటించడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే హెబ్బా పటేల్ తో ఆహాలో ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. కాగా ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్దమవుతోందని టాక్. కాగా అల్లు అరవింద్ స్టార్ హీరోయిన్ తమన్నా ను ఓ టాక్ షో కోసం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా యాప్ లో ఓ స్పెషల్ టాక్ షో లో తమన్నా నటించనున్నట్టు సమాచారం. మరి ఇదే కనుక నిజం అయితే మరింత ప్రచారం ఆహా కు దక్కనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు