ఆ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలోనే విడుదలవుతుందా ?

ఆ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలోనే విడుదలవుతుందా ?

Published on Nov 9, 2020 10:05 AM IST

గత కొన్నాళ్లుగా కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తూ వచ్చారు అల్లరి నరేష్. అయితే అన్ని సినిమాలు ఒకేలా ఉన్నాయనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగడంతో ఆ సినిమాలు చాలా వరకు పరాజయం చెందుతూ వచ్చాయి. దీంతో ట్రాక్ మార్చిన ఆయన ఈసారి సీరియస్ సబ్జెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో సైన్ చేసిన సినిమా ‘నాంది’. కామెడీకి తావులేకుండా ఆసాంతం ఉత్కంఠ భరితంగా ఉండబోతోందట ఈ చిత్రం. ఈ సినిమాను దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ నటిస్తోన్న 57వ చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన ‘నాంది’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కాగా తాజాగా బ్రీత్ ఆఫ్ నాంది పేరుతో సినిమా థీమ్ పాయింట్ ఏంటో తెలియజేసేలా చిన్నపాటి టీజర్ ఒకటి విడుదల చేశారు. అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అది చూశాక నరేష్ పాత చిత్రాలు ‘ప్రాణం, నేను, శంభో శివ శంభో’ చిత్రాలను గుర్తు చేసుకుంటున్నారు ప్రేక్షకులు. ఇది కూడ అలాంటి భిన్నమైన చిత్రంగా ఉంటుందని అంచనాలు పెంచుకుంటున్నారు. నరేష్ సైతం సినిమా విజయం మీద చాలా నమ్మకంగా ఉన్నారు. తప్పకుండా విజయం లభిస్తుందనే ధీమాతో ఉన్నారు.

ముందుగా ఈ సినిమాను ఒటీటీ ద్వారా విడుదల చేస్తారనే టాక్ వచ్చింది. అయితే తాజా సమాచారం మేరకు థియేటర్లలోనే చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారట. వీలైనంతవరకు డిసెంబర్లోనే సినిమా రిలీజ్ కానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శిలు ఇందులో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

తాజా వార్తలు