కామెడి కింగ్ అల్లరి నరేష్ నటించిన ‘లడ్డూ బాబు’ సినిమా ఈ నెలలో మనముందుకు తీసుకురావాలనుకున్నారు కాకపోతే ఇప్పుడు మార్చ్ కు వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. సమాచారం ప్రకారం మార్చ్ నెల ఆఖరి వారంలో ఈ చిత్రాన్ని విడుదలచేస్తారట. ఈ చిత్రానికి వినూత్న కధనం, వెరైటీ కధలతో సినిమాలు తీసే రవిబాబు దర్శకుడు
ఈ చిత్రంలో పూర్ణ హీరొయిన్. ఈమె గతంలో రవిబాబు తీసిన అవును లో కుడా నటించింది. భూమిక ముఖ్య పాత్ర పోషిస్తుంది. కోట వంటి ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో నటించారు. ప్రముఖ రచయితా మహారధి త్రిపురనేని కొడుకు రాజేంద్ర ఈ సినిమాకు నిర్మాత. చక్రి సంగీతదర్శకుడు