బందిపోటుగా అల్లరి నరేష్??

తాజా కధనాల ప్రకారం కామెడి కింగ్ అల్లరి నరేష్ ను త్వరలో మనం ‘బందిపోటు’గా చూడనున్నాం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్. ఈ దర్శకుడు ఇటీవలే ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాకు గానూ మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఈ ‘బందిపోటు’ కామెడి ప్రధానంగా సాగే సినిమా. ఇంకా ఏ విషయమూ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం నరేష్ రవిబాబు దర్శకత్వంలో ఒక వినూత్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘లడ్డూ బాయ్’ అనేది వర్కింగ్ టైటిల్. మరిన్ని వివరాలు త్వరలోనే మీకు అందిస్తాం

Exit mobile version