పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ స్టైలిష్ యాక్షన్ చిత్రమే “ఓజి”. భారీ హైప్ నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఆల్రెడీ ఇండియా లోనే హైయెస్ట్ ప్రీమియర్స్ సెట్ చేసిన సినిమాగా నిలిచింది. మరి ఇదే భారీ హైప్ తో సెన్సేషనల్ డే 1 ని కూడా ప్రామిస్ చేసిన ఈ చిత్రం వసూళ్లు ఎంత వచ్చి ఉండొచ్చు అనే చాలా మంది ఎగ్జైటెడ్ గా ఉన్నారు.
ఎప్పుడు నుంచో పవన్ సినిమాలకి సంబంధించి అఫీషియల్ పోస్టర్స్ లాంటివి వచ్చింది లేదు. కేవలం టాలీవుడ్ పి ఆర్ లెక్కలు మాత్రమే బయటకి వచ్చేవి. కానీ ఈసారి మాత్రం మేకర్స్ అనౌన్స్ చేసే ఫిగర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఇది దాదాపు అసాధ్యమే కానీ అనధికారిక లెక్కల పట్ల కూడా భారీ హైప్ సెట్ అయ్యింది. దీనితో ఓజి 100 కోట్లకి పైగా ఇంకా చెప్పాలంటే 150 కోట్లు దాటుతుంది అని చాలా మంది అంచనా వేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంది అనేది చూడాలి.