నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. తన బ్లాక్ బస్టర్ హిట్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేస్తున్న నాలుగో సినిమా పైగా నాలుగు వరుస హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న ఐదవ సినిమా ఇది కాగా దీనిపై భారీ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ ట్రీట్ ఎట్టకేలకి నేడు రాబోతుంది.
మొదటి భాగానికి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన పనితనం ఎంత ప్లస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు పార్ట్ 2 కూడా గట్టిగానే రీసౌండ్ చేస్తుందని అంచనాలు పెరిగాయి. ఇక ఇటీవల వచ్చిన ప్రోమోకి కూడా సాలిడ్ రెస్పాన్స్ రాగా ఈ ప్రోమో కాకుండా నేడు ఫుల్ సాంగ్ పైనే అందరి కళ్ళు పడ్డాయి. మరి ఈ సాంగ్ నేడు సాయంత్రం 5 గంటల 9 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించగా ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.


