అల్లు అర్జున్ యొక్క ‘అల వైకుంఠపురములో’ చిత్రం యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటిరోజు ఎలాంటి దూకుడైతే చూపిందో ఇప్పుడు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. నిన్నటికి 1.7 మిలియన్ మార్కును అందుకున్న ఈ చిత్రం నేటితో 1.8 మిలియన్ మార్కును టచ్ చేసింది. ఈ మొత్తం శుక్రవారం నాటికి రెండు మిలియన్లను చేరుకునే అవకాశం ఉంది.
ఈ వసూళ్లతో 2020లో ఓవర్సీస్ మార్కెట్లో అత్యధిక మొత్తం రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా నిలబడింది. వసూళ్ల జోరు చూసిన అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్ల సంఖ్యను పెంచారు. దీంతో చిత్రం ఇంకాస్త వేగంగా 2 మిలియన్ మార్కును అందుకోనుంది. మొత్తం మీద సినిమాకు లభిస్తున్న ఆదరణ చూస్తే బన్నీ కెరీర్లో అత్యధిక ఓవర్సీస్ వసూళ్లను నమోదనమోదు చేసేలా కనబడుతోంది.