కాలేజీకి వెళ్ళకుండా చెడు వ్యసనాలు బానిసైన నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ని ఒక అమ్మాయి ఎలా మార్చింది అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం అలా ఐతే. విజయ్ ధరన్ హీరోగా హేమంతిని హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనిల్, అశోక్, నంద కిషోర్, నక్షత్ర, సమీర్, కొండవలస మిగతా పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 15న విడుదల కానుంది. సురేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకి కథ, కథనంతో పాటుగా దర్శకత్వ బాధ్యతలు విజయ్ మేరపాల నిర్వర్తించారు.