ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ లేటెస్ట్ కోర్ట్ డ్రామా

Jolly LLB 3 Review

బాలీవుడ్ సినిమా నుంచి ఈ ఏడాది రిలీజ్ కి వచ్చిన కొన్ని నోటెడ్ సీక్వెల్ చిత్రాల్లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన హీరో అక్షయ్ కుమార్ అలాగే నటుడు అర్షద్ వర్షి కాంబినేషన్ లో వచ్చే కామెడీ కోర్ట్ డ్రామా చిత్రం జాలి ఎల్ ఎల్ బి కూడా ఒకటి. ఇందులో మూడో ఇన్స్టాల్మెంట్ గా పార్ట్ 3 ఈ ఏడాది వచ్చింది. దర్శకుడు సుభాష్ కపూర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా పెర్ఫామ్ చేసింది.

మరి ఈ సినిమా ఫైనల్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కి వచ్చింది. సో ఈ సినిమాని చూడాలి అనుకునే వారు ఓటిటిలో చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి అమన్ పంత్, అనురాగ్, విక్రమ్ లు సంగీతం అందించగా స్టార్ స్టూడియోస్, కంగరా టాకీస్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version