నైజాంలో ‘అఖండ 2’ టికెట్ రేట్లు ఇవే.. ప్రీమియర్ షోలకు ఎంతంటే..?

అఖండ 2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ నైజాం టికెట్ బుకింగ్స్ ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది.

‘అఖండ 2’ టికెట్ రేట్ల విషయంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం చాలా ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నేడు(డిసెంబర్ 4) ప్రీమియర్ షోలకు అనుమతినిస్తూ, టికెట్ ధరను రూ.600/- గా నిర్ణయించింది. ఇక డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 7 వరకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50/-, మల్టీప్లెక్స్‌లలో రూ.100/- చొప్పున టికెట్ రేట్లు పెంచుకునేందుకు థియేటర్లకు అనుమతినిచ్చింది.

దీంతో ‘అఖండ 2’ నైజాం బుకింగ్స్‌కు లైన్ క్లియర్ అయింది. ఇక నేటి సాయంత్రం నుండి థియేటర్లలో ‘అఖండ 2’ తాండవం ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version