నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2 – తాండవం’ తొలి పాటను ముంబైలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా. థమన్ అందించిన “ది తాండవం” సాంగ్ అఘోర అవతారంలో బాలయ్య లుక్, శివతాండవ వాతావరణంతో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ వోకల్స్, కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ పాటకు మరింత డివైన్ ఫీల్ ఇచ్చాయి.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘సనాతన హిందూ ధర్మం శక్తి – పరాక్రమం ఈ సినిమాలో కనిపిస్తాయని.. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా చూపాలి’ అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. ‘ఇది సినిమా కాదు, భారతదేశ ధర్మం-ఆత్మ. మొత్తం కుటుంబం కలిసి చూడగల సినిమాగా రూపొందించాం. -12°Cలో షూట్ చేసిన కఠిన పరిస్థితుల్లోనూ శివుని ఆశీర్వాదంతో సినిమా అద్భుతంగా వచ్చింది’ అని తెలిపారు.
థమన్ మాట్లాడుతూ.. ‘బాలయ్య నిజ జీవితంలోనూ, సినిమాలోనూ లెజెండ్.. ఇంటర్వెల్ బ్లాక్ ఒక్కటే పైసా వసూల్ తరహాలో ఉంటుంది. కైలాష్ ఖేర్ ఈ పాట పాడటం అదృష్టం.’ అని అన్నారు. ఇక నిర్మాతలు అఖండ 2 పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.


