గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2’ ఇప్పుడు కొత్త డేట్ అయిన డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో బాలయ్య మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా, ఈ సినిమాను పెయిడ్ ప్రీమియర్స్ రూపంలో డిసెంబర్ 11న సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో టికెట్ బుకింగ్స్ కూడా తెరిచారు. ఇక ఈ అడ్వాన్స్ టికెకట్ బుకింగ్స్‌లో ‘అఖండ 2’ రఫ్ఫాడిస్తోంది. కేవలం ఏపీలో మాత్రమే టికెట్ బుకింగ్స్ తెరుచుకోవడంతో ఈ మూవీని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో టికెట్ బుకింగ్స్ చేస్తున్నారు. ఏకంగా గంటకు 4 వేలకు పైగా టికెట్ బుకింగ్స్‌తో ఈ మూవీ దూసుకెళ్తోంది.
ఇక తెలంగాణ టికెట్లు తెరుచుకోకుండానే ఈ విధమైన ర్యాంపేజ్ చూపిస్తున్న బాలయ్య.. రెండు రాష్ట్రాల టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయితే, తన మార్క్ తో పూనకాలు తెప్పించడం ఖాయమంగా తెలుస్తోంది.
