నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే “అఖండ 2 తాండవం”. అన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యి ఉంటే ఈ పాటికే షోస్ పడి టాక్ కూడా తెలిసిపోయేది కానీ ఊహించని విధంగా కొన్ని సమస్యలు మూలాన పరిస్థితులు చేదాటిపోయాయి.
అయితే ఈ సమస్యలు మేకర్స్ దాదాపు పరిష్కరించుకున్నారు కూడా కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగింది. ఫైనాన్స్ సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయి కానీ ఈరోజు మొత్తం పూర్తయ్యేసరికి రిలీజ్ పై క్లారిటీ వచ్చేస్తుంది అని సమాచారం. దీనినే నిర్మాత సురేష్ బాబు ప్రస్తావించారు. కానీ ఒక్కసారి ఆగిన రిలీజ్ మళ్ళీ ఎప్పుడు అనేది పెద్ద ప్రశ్న అయితే యూఎస్ మార్కెట్ లో మెయిన్ గా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందట.
అక్కడ ఆల్రెడీ ఒక ప్లానింగ్ ప్రకారం నడుస్తుంది. పైగా హిట్ హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చిన్న పొరపాటు జరిగినా కేటాయించిన స్క్రీన్స్ చేజారిపోతాయి. అంతే కాకుండా అది ఒకో రోజు గడిచే కొద్దీ రన్ కి దెబ్బ పడుతుంది. దీనితో సాధ్యమైనంత వెంటనే రిలీజ్ చేసుకుంటే మంచిది అని అభిమానులు కూడా భావిస్తున్నారు.
ఒక్క వారం అటు ఇటు అయినా పెట్టుకున్న ఇతర సినిమాల పోటీ, పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావడం వంటివి ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. సో ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత బెటర్ అనే అనుకోవాలి, ఒకవేళ ఎక్కువ రోజులు వాయిదా వేసినా అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
