‘అఖండ 2’ మౌనం.. చిన్న సినిమాల అయోమయం..!

Akhanda 2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బోయపాటి-బాలయ్య కాంబోలో మరోసారి సినిమా వస్తుండటంతో ‘అఖండ 2’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆశగా చూశారు.

అయితే, ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులతో పాటు ఇతర చిత్రాల హీరోలు, మేకర్స్ కూడా ఆతృతగా చూస్తున్నారు. చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం అఖండ 2 చిత్ర కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ 12గా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఆ తేదీన రిలీజ్ కానున్న పలు చిత్రాలు అయోమయంలో పడ్డాయి. మోగ్లీ, సైక్ సిద్ధార్థ, ఈషా తదితరల చిత్రాలు డిసెంబర్ 12న రిలీజ్ కానున్నాయి.

కానీ, ఇప్పుడు అనుకోకుండా ‘అఖండ 2’ కూడా అదే రోజున రిలీజ్‌కి వస్తే, ఈ చిత్రాల పరిస్థితి ఎలా ఉండబోతుందా అని సినీ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. మరి అఖండ 2 రిలీజ్ డేట్‌పై మౌనం ఎప్పుడు వీడుతుందో.. దాని ప్రభావం చిన్న సినిమాలపై ఎలా ఉండబోతుందో చూడాలి.

Exit mobile version