నందమూరి బార్న్ కింగ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ చిత్రం అఖండ 2 కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో థియేటర్స్ లో తాండవం చేయనుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో మేకర్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో భాగంగా అప్పుడే నార్త్ లో సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా మేకర్స్ స్టార్ట్ చేశారు.
నేడు సాయంత్రం సాంగ్ ముంబైలో లాంచ్ చేస్తుండగా స్లైడ్ ప్రమోషన్స్ నార్త్ మీడియా ఛానెల్స్ లో ప్లే చేస్తుండడం ఇపుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక రిలీజ్ అయ్యే వరకు ఇదే జోరు కొనసాగితే మాత్రం హిందీ మార్కెట్ లో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ డిసెంబర్ 5న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
