బిగ్ అప్డేట్ : ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు క్యాన్సిల్..!

అఖండ 2’ ప్రీమియర్

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు నేటి రాత్రి నుండి వేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఈ క్రేజీ సీక్వెల్ వస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా ప్రీమియర్ షోలు ఇప్పటికే యూఎస్, ఆంధ్రాలో ఫిక్స్ అయ్యాయి. అయితే, తెలంగాణలో మాత్రం ఈ ప్రీమియర్ షోలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతూ వచ్చింది. ప్రభుత్వం నుంచి జీవో వచ్చినప్పటికీ బుకింగ్స్ మాత్రం ఇంకా తెరుచుకోలేదు. అయితే, ఈ చిత్ర ప్రీమియర్ షోలు దేశవ్యాప్తంగా క్యాన్సిల్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ప్రీమియర్ షోలు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నించామని.. అయితే, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల అది సాధ్యపడలేదని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

దీంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి అమెరికాలో అయినా ఈ చిత్ర ప్రీమియర్ షోలు కరెక్ట్ టైమ్‌కు వేస్తారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

Exit mobile version