షాకింగ్ : చివరి నిమిషంలో ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా.. కారణాలేమిటో..?

Akhanda 2

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2) డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే, నాటకీయ పరిణామాలతో ఈ చిత్ర పెయిడ్ ప్రీమియర్స్‌ను మేకర్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై ఆందోళన వ్యక్తం అయింది.

అయితే, ఇప్పుడు ఏకంగా ఈ సినిమా రిలీజ్‌నే వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించి అందరికీ షాకిచ్చారు. అనివార్య కారణాల వల్ల ‘అఖండ 2’ చిత్రాన్ని అనుకున్న తేదీలో రిలీజ్ చేయలేకపోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అది అభిమానులతో పాటు తమకు కూడా బాధను కలిగించే విషయమని.. అయితే, సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు తాము కృషి చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ వార్తతో అభిమానులు, సినిమా ప్రేమికులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, ఇలా చివరి నిమిషంలో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version