Akhanda 2 : మరోసారి హాట్ టాపిక్‌గా మారిన ‘అఖండ 2’

Akhanda 2

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది ఖచ్చితంగా అఖండ 2(Akhanda 2) అనే చెప్పాలి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న నాలుగో చిత్రం కావడంతో ఈ సినిమా ఎలాంటి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. రిలీజ్ కు ముందు రోజు ఈ సినిమా వాయిదా పడటంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చిత్ర వర్గాలు కూడా ఈ సినిమా వాయిదా పడటంతో ఖంగుతిన్నారు. అయితే, కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడటంతో, తిరిగి ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్న వార్తల ప్రకారం అఖండ 2(Akhanda 2) చిత్రానికి సంబంధించిన అన్ని సమస్యలు సద్దుమనిగినట్లు తెలుస్తోంది. అంతేగాక, రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 12న ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

దీంతో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాతో పాటు సినీ సర్కిల్స్‌లో అఖండ 2(Akhanda 2) హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ చిత్ర అధికారిక రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version