ట్విస్ట్: ‘అఖండ 1’ ఎప్పుడు చేయాల్సిన సినిమానో తెలుసా!

Akhanda1
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో చేస్తున్న అవైటెడ్ సినిమానే అఖండ 2 తాండవం. అయితే కొన్నాళ్ల కితం కరోనా వేవ్ లోనే మొదటి భాగం వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. హిట్ అనే దానికంటే తెలుగు సినిమా పూర్వ వైభవం మళ్లీ ఈ సినిమా వెనక్కి తీసుకొచ్చింది అని చెప్పాలి.

అలాంటి ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా ఒక ఊహించని లాంగ్ రన్ ని ఈ సినిమా అందుకుంది. మరి అలాంటి సంచలన విజయం అందుకున్న ఈ సినిమా నిజానికి బాలయ్య కెరీర్ మైలురాయి చిత్రం 100వ సినిమాగా చేయాల్సిన సినిమా అనిబోయపాటి తెలిపారు. కానీ ఆ సమయంలో తను సరైనోడు కి లాక్ అయ్యి ఉండడం వల్ల ఇద్దరి మధ్య ఆ 100వ సినిమా కుదరలేదు అని అన్నారు.

ఆ తర్వాత కలిసినప్పుడు ఇలా ఒక ఐడియా ఉంది మిమ్మల్ని అఘోరగా పెట్టి సినిమా చేయాలి అనుకుంటున్నాను బాబు అంటే ఓకే చెప్పేసారు అని అలా అఖండ 1 మొదలైనట్లుగా తెలిపారు. మరి ఒక ఏదేమిదేళ్ల కితం కొంచెం అన్నీ సెట్ అయ్యి ఉంటే బాలయ్య కెరీర్ 100వ సినిమా గానే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పడి ఉండేది అని చెప్పాలి.

Exit mobile version