‘రొమాంటిక్’గా ఎండ్ చేయబోతున్నారట !


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాష్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ‘రొమాంటిక్’. యంగ్ డైరెక్టర్ అనిల్ పాదూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా క్లైమాక్స్ స‌న్నివేశాలతో పాటు కొన్ని రొమాంటిక్ సీన్స్ కు సంబంధించిన ఫ్యాచ్ వర్క్ మాత్రమే ఈ సినిమా షూటింగ్ మిగిలిఉందట. కరోనా ప్రభావం తగ్గాక మిగిలిన షూటింగ్ పార్ట్ ను ప్లాన్ చేయనున్నారు. అయితే క్లైమాక్స్ సీన్స్ లో లిప్ టు లిప్ కిస్ సీన్ ఉందట. చివరి షాట్ కిస్ తోనే సినిమాకి ఎండింగ్ కార్డు వేస్తారట. మొత్తానికి ‘రొమాంటిక్’గా ముగించబోతున్నారు అన్నమాట.

అన్నట్టు ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుంది. మరి ఈ చిత్రంతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందా… హిట్ వస్తేనే కెరీర్.. లేకపోతే ఆకాష్ కి కెరీర్ కష్టమే అవుతుంది. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై గాఢమైన స్నేహ పక్షులు పూరి జ‌గ‌న్నాథ్‌ – ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version