ఆర్ ఆర్ ఆర్ స్టార్ మూవీ 250కోట్లు వసూలు చేసింది

ఆర్ ఆర్ ఆర్ స్టార్ మూవీ 250కోట్లు వసూలు చేసింది

Published on Feb 3, 2020 3:41 PM IST

బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ లేటెస్ట్ మూవీ తన్హాజీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం ఏకంగా 250కోట్ల వసూళ్లు దక్కించుకొని అబ్బురపరిచింది. పీరియాడిక్ మూవీగా వచ్చిన తన్హాజీ…ఛత్రపతి శివాజీ సైన్యాధ్యక్షుడు అయిన తన్హాజీ వీర గాథ ఆధారంగా తెరకెక్కింది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో తన్హాజీ పాత్ర చేయగా హీరోయిన్ కాజోల్ తన్హాజీ భార్య పాత్ర చేశారు. ఈ చిత్రంలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్ర చేయడం విశేషం.

దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 150కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన తన్హాజీ పోటీలో కూడా భారీ వసూళ్లు దక్కించుకుంది. ఇక అజయ్ దేవగణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఓ ప్రాధాన్యం ఉన్న రోల్ చేస్తున్నారు. ఇటీవలే మొదలైన తాజా షెడ్యూల్ నందు అజయ్ దేవగణ్ పాల్గొంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు రోల్ చేస్తున్నారు.

తాజా వార్తలు