ప్రస్తుతం సౌత్ ఇండియా మరియు నార్త్ ఇండియా చూపంతా అందాల భామ ఐశ్వర్య రాయ్ కంబ్యాక్ మూవీ పైనే ఉంది. కొద్ది రోజుల క్రితం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ ద్విభాషా చిత్రానికి సైన్ చేసిందని అన్నారు. ఈ సినిమాలో నాగార్జున, మహేష్ బాబు కూడా నటించనున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.
తాజా వార్తల ప్రకారం చంద్రముఖి డైరెక్టర్ పి. వాసు ఓ ద్విభాషా చిత్రం కోసం ఐశ్వర్యరాయ్ ని కలిసినట్లు సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న దాని ప్రకారం ఐశ్వర్య రాయ్ కూడా సముఖత చూపినట్లు సమాచారం. ఈ సినిమాలో కళరి ఫైటర్ గా నటించనుందని సమాచారం. పి. వాసు ద్వి భాషా చిత్రంగా ప్లాన్ చేస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీలో విజువల్ ట్రీట్, అలాగే యానిమేషన్ ఫార్మాట్ లో సినిమా ఉంటుందని సమాచారం.
ఈ సినిమా కోసం మరికొంతమంది తెలుగు, తమిళంలో కొంతమంది నటీనటులను కూడా పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.