గత కొన్ని రోజులు కితమే అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా రూపొందించిన లఘు చిత్రం యూట్యూబ్ మరియు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది. ఈ చిత్రం ప్రమాదం తీవ్రతను, దాని అనంతర పరిణామాలను సజీవంగా చూపించడంతో ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ AI షార్ట్ ఫిలిం డీటెయిల్స్ ఇలా ఉన్నాయి
“అహ్మదాబాద్ విమాన ప్రమాదం” అనే ఈ AI లఘు చిత్రాన్ని (ఆరా ప్లే)AuraPlay అనే OTT ప్లాట్‌ఫారమ్ రూపొందించింది. AuraPlay GenAI ఆధారిత సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆడియో సిరీస్‌లు, పాడ్‌క్యాస్ట్‌లను చేయడంలో కొనసాగుతున్నారు. అయితే అహ్మదాబాద్ ఘటనపై చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ కి యూట్యూబ్‌లో కేవలం ఈ కొన్ని రోజుల్లోనే 7.5 లక్షల పైగా వీక్షణలను సాధించి, సామాజిక మాధ్యమాల్లో భారీగా షేర్ అవుతుంది.
ఈ లఘు చిత్రంలో భరూచ్‌కు చెందిన ఒక మహిళ కథను చూపిస్తారు. ఆమె కేవలం 10 నిమిషాలు ఆలస్యంగా రావడంతో చెక్-ఇన్ చేయడానికి అనుమతించబడలేదు. దీంతో ఆమె విమానంలో ప్రయాణం చేయకుండా తప్పించుకుంది. ఈ ఘటన ఆమెకు ప్రాణ రక్షణగా మారింది. అలాగే, ప్రమాదంలో చిక్కుకున్న విమానంలోని శిథిలాల నుండి బయటపడిన ఏకైక ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కథను కూడా ఈ చిత్రం వివరంగా చూపించింది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం వివరాలు
2025 జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 171 విమానం, బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్, టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు. విమానం BJ మెడికల్ కాలేజ్ హాస్టల్, మెస్ క్యాంపస్‌ను ఢీకొట్టడంతో అనేక మంది స్థానికులు, యువ వైద్యులు మరణించగా, ఇంకొందరు గాయపడ్డారు.
ఈ ప్రమాదం భారతదేశ చరిత్రలో అత్యంత తీవ్రమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. విమానం టేకాఫ్ అయిన 40 సెకన్లలోపే కూలిపోయింది. పైలట్ ప్రమాదం ముందే “మేడే” కాల్ ఇచ్చాడు, ఇది విమానంలో తీవ్రమైన వైఫల్యాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. గ్రౌండ్ స్టాఫ్ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోబడ్డాయి, CCTV ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బోయింగ్ సాంకేతిక బృందం కూడా దర్యాప్తులో భాగంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణాలు హ్యూమన్ ఎర్రర్, సాంకేతిక వైఫల్యం, విధ్వంసం వంటి అన్ని అంశాలను పరిశీలిస్తూ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు.