మళ్ళీ మాస్ లోకి దిగిన సూర్య.. పవర్ టైటిల్ తో తన నెక్స్ట్!

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా ఇప్పుడు తెలుగు సహా తమిళ్ లో కూడా సాలిడ్ లైనప్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరి తన కెరీర్ 45వ సినిమా కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు దర్శకుడు ఆర్ జె బాలాజీ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా నుంచి ఇపుడు మేకర్స్ సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.

ఈ చిత్రం నుంచి పవర్ఫుల్ టైటిల్ గా ‘కరుప్పు’ ని లాక్ చేసి అనౌన్స్ చేశారు. ఇక దీనితో పాటుగా సాలిడ్ మాస్ ప్రీ లుక్ పోస్టర్ ని కూడా సూర్యపై డిజైన్ చేయడంతో ఫ్యాన్స్ మళ్ళీ వింటేజ్ సూర్య రేంజ్ మాస్ ని ఆశిస్తున్నారు. మరి ఆర్జే బాలాజీ సూర్యతో ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా డ్రీం వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version