ఓటిటి నుంచి థియేటర్స్ లోకి సుమంత్ ఎమోషనల్ సినిమా!

ఎక్కువ సమయం తీసుకొని తక్కువ సినిమాలు చేసే వారిలో మన తెలుగు నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల ఎలాగో తనతో పాటుగా హీరో సుమంత్ కూడా ఒకరని చెప్పొచ్చు. అయితే వారు చేసే సినిమాలు కూడా మంచి కల్ట్ క్లాసిక్ గా నిలిచినవి కూడా ఉన్నాయి. ఇలా సుమంత్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమానే “అనగనగా”.

నేరుగా ఓటిటిలోనే విడుదల అయ్యిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎమోషనల్ గా ఆడియెన్స్ ని ఎంతగానో కదిలించిన ఈ చిత్రం ఓటిటి నుంచి ఇపుడు థియేటర్స్ లోకి వస్తుంది. అల్రెడీ ఈటీవీ విన్ వారు వైజాగ్, విజయవాడలో లిమిటెడ్ గా ఫ్రీ షోస్ థియేటర్స్ లో వేయగా వాటికి అనూహ్య స్పందన వచ్చింది. మరి ఈ సక్సెస్ తో సుమంత్ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ వారం నుంచి కొన్ని అదనపు స్క్రీన్స్ లో కూడా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది అని తాను తెలిపారు. ఇది థియేటర్స్ లో రావాల్సిన సినిమా కదా ఓటిటిలో ఎందుకు రిలీజ్ చేసారని అంటున్నారని సుమంత్ తన ఆనందాన్ని పంచుకున్నారు. దీనితో తన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version