‘కిస్ – కీప్ ఇట్ సింపుల్ స్టుపిడ్’ సినిమాను ప్రచారం చెయ్యడానికి పలు వినూత్న మార్గాలను అడివి శేష్ ఎంచుకున్నాడు. ఈ సినిమాలో అతను నటించడమే కాక దర్శకత్వం కుడా వహించాడు. అతని సోదరుడు సాయి కిరణ్ అడివి నిర్మాత. కేవలం మీడియా ముందు ప్రచారం ఇవ్వడం కాకుండా అడవి శేష్ ఈ సినిమా ప్రచారం కోసం రాష్ట్రంలో వున్న పలు కాలేజీలను చుట్టి వస్తున్నాడు. ఈ కొత్త ప్రచారం ఇప్పటకే హైదరాబాద్ లో పలు కాలేజీల ద్వారా మొదలైంది. ఈ సినిమా పుర్తవ్వడంలో అతను ఎదుర్కున్న సంఘటనలను విద్యార్ధులతో కలిసి పంచుకుంటున్నాడు. ఇటీవలే రాజమండ్రి లో ఒక కళాశాలను సందర్శించారు. మరిన్ని కాలేజీలను సందర్శిస్తారని అంచనా. ఈ రొమాంటిక్ చిత్రంలో అడివి శేష్ , పియా భాజ్ పై ప్రధాన పాత్రలు. షానీల్ డియో సినిమాటోగ్రాఫర్. శ్రీ చరణ్ పాకల, పెటే వండర్ సంగీత దర్శకులు