బాలీవుడ్ అదితి రావు హైదరి చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ, అదితి రావు హైదరి ఏం పోస్ట్ చేసింది అంటే.. తన పేరు, ఫొటో వినియోగిస్తూ ఓ వ్యక్తి ఫొటోగ్రాఫర్లను మోసం చేస్తున్నాడని, అలాంటి ఫేక్ అకౌంట్ నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ అదితి రావు హైదరి నెటిజన్లకు తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అదితి రావు పోస్టు చేస్తూ.. ‘ఓ వ్యక్తి వాట్సాప్‌లో నా పేరుతోపాటు ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకుని.. ఫొటోషూట్స్ పేరిట పలువురు ఫొటోగ్రాఫర్లకు మెసేజ్ చేస్తున్నట్టు నాకు తెలిసింది’ అని అదితి రావు హైదరి తెలిపింది.
అదితి రావు హైదరి తన పోస్ట్ లో ఇంకా రాసుకొస్తూ.. ‘ఈ విషయాన్ని కొందరు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ మెసేజ్‌లు చేసింది నేను కాదు. ఫొటోషూట్ లాంటి వాటి కోసం ఎవరినైనా కాంటాక్ట్ అవ్వాలన్నా.. నేను వ్యక్తిగత ఫోన్ నెంబరు వాడను. నా టీమ్ ద్వారానే వారిని సంప్రదిస్తుంటాను. ఒకవేళ మీకు ఇలాంటి మెసేజ్‌లు వస్తే.. మా ఇన్స్టాగ్రామ్ ఖాతా arhconnect ద్వారా తెలియజేయండి’’ అంటూ అదితి రావు హైదరి క్లారిటీ ఇచ్చింది.


