సుశాంత్ నటిస్తున్న ‘అడ్డా’ సినిమా ట్రైలర్ మరో రెండు రోజులలో విడుదలకానుంది. ఈ సినిమా షూటింగ్ చాలా రోజులపాటు జరిగింది. ఆగష్టు మధ్యలో ఇతర చిత్రాల పోటీ తక్కువవుంటుంది కనుక ఆ సమయంలో ఈ సినిమాను విడుదల చేద్దామని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ట్విస్ట్ లు కలిగిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో సుశాంత్ సరసన షన్వి నటిస్తుంది. సుశాంత్ పాత్ర చిత్రీకరణ ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సుశాంత్ సినిమా విడుదలై మూడు సంవత్సరాలు కావస్తుంది. ఈ కొత్త సినిమా రషెస్ చూస్తుంటే ఈ సమయంలో సుశాంత్ చాలా వృద్ధి చెందాడనే చెప్పాలి. చింతలపూడి శ్రీనివాసరావు మరియు నాగ సుశీల నిర్మాతలు. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. శ్వేతా భరద్వాజ్ ఒక ప్రత్యేక గీతంలో కనిపించనుంది. మరో రెండు పాటలను యూరోప్ లో చిత్రీకరించారు