దేవి పుట్టినరోజును జరిపిన అత్తారింటికి దారేది బృందం

Devi-sri-prasad-1
ఆగష్టు 2న పుట్టిన రోజు జరుపుకోవాల్సిన దేవి శ్రీప్రసాద్ పవర్ స్టార్ కారణంగా తన పుట్టిన రోజు వేడుకలను ఒక రోజు ముందుగానే ప్రారంభించాడు. నిజమే, పవన్ కళ్యాన్, త్రివిక్రమ్, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ లు దేవీని ఒక సర్ప్రైజ్ కేక్ తో అనుకోని బహుమతిని అందించారట

ఈ వార్తను స్వయంగా దేవి తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. “హైదరాబాద్ లో పని పూర్తయింది. నాచే ఒక ప్రత్యేకమైన కేకును కట్ చేయించి నా పుట్టిన రోజును ఒక రోజు ముందుగానే జరిపిన త్రివిక్రమ్ గారికి, పవన్ కళ్యాన్ కు ధన్యవాదాలు” అని తెలిపాడు.

ఈ సినిమా ఆగష్టు 7న ఆంధ్రాలో భారీ విడుదలకు సిద్ధమవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు సంబంధించిన డి.టి.ఎస్ పనులను పూర్తిచేసాడు. ఈ సినిమాలో సమంత మరియు ప్రణీత హీరోయిన్స్

Exit mobile version