మరో కొత్త రికార్డును సొంతంచేసుకున్న అత్తారింటికి దారేది

Attarintiki-Daredi-Posters-1
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుందన్న విషయం తెలిసినదే. బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేకుండా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు మరో కొత్త రికార్డును సృష్టించింది. 10వ రోజు ముగిసేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 55.54 కోట్లను సంపాదించింది. ఒక తెలుగు సినిమా పది రోజులలో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించడం ఇదే మొదటిసారి

నిజంగా ఇది నమ్మశక్యం కాని కలేక్షన్లనే చెప్పాలి. పలు భారీ బడ్జెట్ చిత్రాలు తమ పూర్తిస్థాయి నిడివిలో సైతం సాధించలేని కలెక్షను ఇవి.

ఏరియాల వారీగా బ్రేక్ అప్ వివరాలు మీకు అందిస్తున్నాం

అత్తారింటికి దారేది 10రోజుల కలెక్షన్లు

ఏరియా కలెక్షన్లు
నైజాం 16.08 కోట్లు
సీడెడ్ 6.92 కోట్లు
ఉత్తరాంధ్ర 3.78 కోట్లు
నెల్లూరు 1.78కోట్లు
గుంటూరు 3.58 కోట్లు
కృష్ణ 2.75 కోట్లు
తు.గోదావరి 2.80 కోట్లు
ప. గోదావరి 2.35 కోట్లు
మొత్తం ఆంధ్రప్రదేశ్ షేర్(10 రోజుల్లో) 40.04 కోట్లు
కర్ణాటక 4.65కోట్లు
ఇండియా మిగిలిన ప్రాంతాలలో 1.65 కోట్లు
విదేశాలలో 9.20కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా 55.54 కోట్లు
Exit mobile version