‘ఏస్’ హీరోకు బాగా నచ్చిన ‘కోర్ట్’

న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ నుంచి వచ్చిన రీసెంట్ మూవీ ‘కోర్ట్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు రామ్ జగదీష్ డైరెక్ట్ చేయగా ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.

ఇక ఈ సినిమాకు ఇప్పుడు ఓ వెర్సటైల్ హీరో కూడా ఫిదా అయ్యాడు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఏస్ చిత్రం తాజాగా రిలీజ్ అయింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన కోర్ట్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలోని కంటెంట్ తనకు బాగా నచ్చిందని.. ఇలాంటి సినిమాలు నేటి సమాజానికి అవసరం అని ఆయన పేర్కొన్నాడు. దీంతో కోర్ట్ చిత్రం మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Exit mobile version