మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ లేటెస్ట్ గా నాలుగో సీజన్ ను రసవత్తరంగా పూర్తి చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఫైనల్స్ లో అభిజీత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. 100 రోజులకు పైగా సుదీర్ఘ ప్రయాణంను గత వారం ఫైనల్స్ ఎపిసోడ్ తో తేల్చేసారు. అయితే ఈ షోను టెలికాస్ట్ చేసే స్టార్ మా ఈరోజు తమ ఆడియెన్స్ కోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ ను డిజైన్ చేసినట్టుగా తెలుపుతున్నారు.
ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్ 4 ఎపిసోడ్స్ లో అన్ని కలిపి ఒక స్పెషల్ ఎపిసోడ్ గా “జర్నీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 4” ను టెలికాస్ట్ చేయనున్నట్టుగా తెలిపారు. ఈ ఎపిసోడ్ ను ఈరోజు రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ ఎపిసోడ్ ను ఎలా డిజైన్ చేశారో తెలియాలి అంటే ఈరోజు రాత్రి వరకు ఆగాల్సిందే. అలాగే ఆడియెన్స్ ఈ ఎపిసోడ్ కు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో కూడా చూడాలి.
#JourneyOfBiggBossTelugu4 Today at 9 PM on @StarMaa#BiggBossTelugu4 pic.twitter.com/JGXK4iCNht
— Starmaa (@StarMaa) December 26, 2020