ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డేలు హీరో హీరోయిన్లుగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “రాధే శ్యామ్”. పీరియాడిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మరి అలాగే ఈ పెయింటింగ్ లాంటి చిత్రాన్ని ఎక్కువగా ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి ఆ బ్యాక్ డ్రాప్ లోనే ఈ చిత్రంలో ఒక మైండ్ బ్లోయింగ్ సాంగ్ ను మేకర్స్ డిజైన్ చేస్తున్నారట. అంతే కాకుండా ఆ వండర్ ఫుల్ సెట్ ను హైదరాబాద్ లో వేసి చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.
అలాగే ఈ సాంగ్ కు గాను ఏకంగా 300 మందికి పైగా ఇటాలియన్ డాన్సర్స్ ను రంగంలోకి దింపారట. ఇప్పటికే జస్టిన్ ప్రభాకరన్ మోషన్ పోస్టర్ టీజర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు అంతా మెస్మరైజ్ అయ్యారు. అలాగే ట్యూన్స్ కూడా చాలా బాగా వచ్చాయని తెలిసిందే. మరి ఇప్పుడు ప్లాన్ చేసిన సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి.