‘కింగ్డమ్’ కోసం విజయ్ దేవరకొండ క్రేజ్ చూశారా.. ఏకంగా 40 అడుగుల భారీ కటౌట్!

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరక్కించిన భారీ చిత్రం కింగ్డమ్ కోసం అందరికీ తెలిసిందే. ఇక విడుదలకి అత్యంత చేరువలో ఉన్న సినిమా తాలూకా హంగామా ఆల్రెడీ మొదలైంది. తాజాగా తిరుపతి నెహ్రు మున్సిపల్ గ్రౌండ్ లో విజయ్ పై 40 అడుగుల భారీ కటౌట్ ని ఎస్టాబ్లిష్ చేయడం వైరల్ గా మారింది.

సినిమాలో విజయ్ చేసిన సూరి మాస్ లుక్ ని కటౌట్ గా మార్చి పెట్టడం వైరల్ గా మారింది. ఇక రేపు జూలై 26న గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని జరపనున్నారు. ఈ ట్రైలర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.

Exit mobile version