‘ఓజి’ నుంచి అదిరిన లేటెస్ట్ పవర్ఫుల్ పోస్టర్.. రక్త పాతమే ఇక

‘ఓజి’ నుంచి అదిరిన లేటెస్ట్ పవర్ఫుల్ పోస్టర్.. రక్త పాతమే ఇక

Published on Sep 23, 2025 12:32 PM IST

OG

ఇంకొక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం “ఓజి” గ్రాండ్ గా రిలీజ్ కి రావడానికి సిద్ధం అవుతుంది. నెక్స్ట్ లెవెల్ హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం రికార్డుల వేట షురూ చేయడానికి సిద్ధంగా ఉండగా ప్రస్తుతం అభిమానులు మరింత ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న ఒకో కంటెంట్ సిక్సర్ అయితే ఇప్పుడు రిలీజ్ కి ముందు విడుదల చేసిన పోస్టర్ మాత్రం మంచి పవర్ఫుల్ గా ఉందని చెప్పాలి.

కటానా పట్టుకొని ఓజాస్ సృష్టించిన రక్తపాతంలో పవర్ స్టార్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నారు. నిన్న వచ్చిన ట్రైలర్ లో కూడా దీనికి మరో షాట్ ఉంది. మొత్తానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఊహించని లెవెల్లో ఉండేలా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా తన ఫ్యాన్ బాయ్ సుజీత్ దర్శకత్వం వహించాడు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు